రోడ్డు ప్రమాదంలో పెయింటర్ మృతి: రేపే నిశ్చితార్థం !

7చూసినవారు
రోడ్డు ప్రమాదంలో పెయింటర్ మృతి: రేపే నిశ్చితార్థం !
ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని మద్దులపల్లి గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. మద్దులపల్లికి చెందిన గొడ్డు గొర్ల ప్రసాద్ (పెయింటర్) రాత్రి 10 గంటల సమయంలో కిరాణా షాపుకు వెళ్లి తిరిగి రోడ్డు దాటుతుండగా, గుర్తుతెలియని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రసాద్ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న సీఐ ముష్కరాజు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రేపు గురువారం ప్రసాద్‌కు నిశ్చితార్థం జరగాల్సి ఉండగా, ఈ దుర్ఘటన కుటుంబ సభ్యులను, గ్రామస్తులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది.
Job Suitcase

Jobs near you