పాలేరు మహోత్సవాలకు నేడు ముగింపు వేడుకలు

95చూసినవారు
పాలేరు మహోత్సవాలకు నేడు ముగింపు వేడుకలు
పాలేరులోని అద్భుతాల మేరీ మాత పుణ్యక్షేత్ర మహోత్సవాలు శనివారం ముగింపు వేడుకలతో ఘనంగా ముగియనున్నాయి. ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా ఆర్‌సీఎం బిషప్ డాక్టర్ సగిలి ప్రకాష్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సాయంత్రం ఐదు గంటలకు మరియతల్లి తేరు ప్రదక్షిణ నిర్వహించనున్నట్లు విచారణ గురువు ఫాదర్ కొమ్ము ఆంతోనీ తెలిపారు. అనంతరం బిషప్ డాక్టర్ సగిలి ప్రకాష్ ఆధ్యాత్మిక ప్రసంగం చేయనున్నారు. ప్రత్యేక ప్రార్థనలు, ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకోనున్నాయని నిర్వాహకులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్