ఖమ్మం జిల్లాలో వాసవి క్లబ్ జోన్–II ఆధ్వర్యంలో జోన్ చైర్మన్ పసుమర్తి రామమోహన్ రావు నిర్వహించిన జోన్ సోషల్ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ రామమందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాలుగు క్లబ్బుల ప్రతినిధులు, సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముఖ్య అతిథిగా వాసవి గోల్డెన్ స్టార్ కొత్త వెంకటేశ్వర, ఇంటర్నేషనల్ డైరెక్టర్ పాల్గొన్నారు. సమాజ సేవకు గుర్తింపుగా ‘పసుమర్తి జగన్నాథం సేవా పురస్కారాలు’ అందజేశారు. మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని నిర్వాహకులు తెలిపారు.