ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని నెలకొండపల్లి మండలం ప్రభుత్వ వైద్యశాలలో
జనసేన పార్టీ ఆధ్వర్యంలో బుధవారం కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా, ముఖ్య రాజేంద్రప్రసాద్ నేతృత్వంలో ప్రభుత్వ వైద్యశాలలోని రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో
జనసేన పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ డాక్టర్ల అనుమతి లభించింది.