ఖమ్మం డివిజన్ పిడిఎస్యూ నూతన కమిటీ ఎన్నికైంది. అధ్యక్షులుగా వినయ్, సాధిక్ పాషా, ఉపాధ్యక్షులుగా హరీష్, సందీప్, ప్రధాన కార్యదర్శిగా యశ్వంత్ కుమార్, సహాయ కార్యదర్శులుగా వినయ్, అశోక్, కోశాధికారిగా నసీర్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ, విద్యార్థి సమస్యల పరిష్కారం, ప్రభుత్వ విద్యాభివృద్ధి, ఖమ్మం జిల్లాకు యూనివర్సిటీ సాధన కోసం విద్యార్థి ఉద్యమాలను బలోపేతం చేస్తామని తెలిపారు. ఈ ఎన్నిక విద్యార్థి సంఘాల కార్యకలాపాలకు కొత్త ఊపునిస్తుందని భావిస్తున్నారు.