
ఏపీలో ‘ఇంధన’ కష్టాలు.. వాహనదారుల ఇబ్బందులు
ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రమైంది. పలు చోట్ల నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం, బాపట్ల జిల్లా చీరాల, పర్చూరు నియోజకవర్గాల్లో కొన్ని బంకులు మూతపడ్డాయి. విజయవాడలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. డీజిల్ డిమాండ్ అధికంగా ఉండటంతో ట్రాక్టర్లు, లారీలు బంకుల వద్ద క్యూకడుతున్నాయి. దూరప్రాంత ప్రయాణాలకు వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. అధికారులు అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.




