బాణాసంచి దుకాణాలు ఏర్పాటుకు అనుమతి తప్పనిసరి

5చూసినవారు
బాణాసంచి దుకాణాలు ఏర్పాటుకు అనుమతి తప్పనిసరి
ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో దీపావళి సందర్భంగా బాణసంచా దుకాణాలు ఏర్పాటు చేయాలనుకునే వ్యాపారులు తప్పనిసరిగా అధికారుల నుండి ముందస్తు అనుమతులు మరియు లైసెన్సులు పొందాలని అధికారులు స్పష్టం చేశారు. బుధవారం జారీ చేసిన ఈ హెచ్చరిక ప్రకారం, అనుమతి పొందిన వారు మాత్రమే నిబంధనలకు లోబడి, అగ్నిమాపక భద్రతా ప్రమాణాలను పాటిస్తూ దుకాణాలు నిర్వహించాలి. నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా విక్రయాలు జరిపినా లేదా అనుమతి లేకుండా దుకాణాలు తెరిచినా కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్