ఖమ్మం నగరపాలక సంస్థ 12వ డివిజన్‌లో హరిత ఖమ్మం లక్ష్యంగా డోర్-టు-డోర్ మొక్కల పంపిణీ కార్యక్రమం గురువారం నిర్వహించారు. ప్రజలకు ఉచితంగా మొక్కలను అందించి, ఇంటింటా మొక్కలు నాటి సంరక్షించాలని అవగాహన కల్పించారు. పర్యావరణ హితమైన ఖమ్మం కోసం ప్రజల భాగస్వామ్యం కోరారు.