హోలీ సందర్భంగా ఖమ్మంలో మద్యం దుకాణాల మూసివేత: పోలీస్ కమిషనర్ ఆదేశాలు

4చూసినవారు
హోలీ సందర్భంగా ఖమ్మంలో మద్యం దుకాణాల మూసివేత: పోలీస్ కమిషనర్ ఆదేశాలు
హోలీ పండుగ సందర్భంగా ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాలను మూసివేయాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశించారు. ఈ ఆదేశాలు రేపు ఉదయం 6 గంటల నుంచి మార్చి 4వ తేదీ ఉదయం 6 గంటల వరకు అమలులో ఉంటాయి. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.