ఖమ్మం కలెక్టరేట్ వద్ద ఇటీవల పోలీసులు, నాయకుల మధ్య జరిగిన తోపులాటలో పీడీఎస్యు జిల్లా అధ్యక్షుడు గోకినపల్లి మస్తాన్ గాయపడ్డారు. భూదాన్ భూముల్లో ఇండ్ల కూల్చివేతకు వ్యతిరేకంగా ఈ నెల 1న కలెక్టరేట్ లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసేందుకు వెళ్లిన నాయకులను పోలీసులు అడ్డుకొని, వాహనంలో ఎక్కించేందుకు బలవంతంగా నెట్టడంతో ఆయన చేతికి గాయమైంది. మంగళవారం ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోగా, వైద్యులు ఆయన చేయి ఫ్రాక్చర్ అయిందని నిర్ధారించారు.