ఖమ్మం జిల్లాలో స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలు జరిగేలా సమన్వయంతో పని చేయాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో, ఎన్నికల బందోబస్తు నిర్వహించే పోలీస్ సిబ్బందికి ఎన్నికల విధులు, విధివిధానాలు, ఎన్నికల ప్రవర్తన నియమావళి, శాంతిభద్రతల పరిరక్షణ తదితర అంశాలపై ఖమ్మం రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల సంఘం నియంత్రణలో క్రమశిక్షణతో పని చేయాలని ఆయన ఆదేశించారు.