హమాలీ కార్మికులకు ఇంటి స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని సీఐటీయూ ఆధ్వర్యంలో శనివారం ఖమ్మం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఆల్ హమాలీ కార్మికులందరికీ సంక్షేమ బోర్డు ఏర్పాటుతో పాటు సమగ్ర చట్టం చేయాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ లు రద్దు చేయాలని, 50 ఏళ్లు దాటిన హమాలీలకు రూ. 5వేలు పెన్షన్ ఇవ్వాలని యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు వై. విక్రమ్ డిమాండ్ చేశారు.