నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే నియంత్రించాలని సిపిఐ నాయకులు మహమ్మద్ సలాం ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఖమ్మంలోని లెనిన్ నగర్‌లో ఎస్కే చానా అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బియ్యం సహా నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. మధ్య దళారుల బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టాలని, అన్ని గోదాములపై నిఘా పెట్టాలని కోరారు. ఒకటి రెండు మిల్లులపై దాడులతో సమస్య పరిష్కారం కాదన్నారు. సమావేశంలో యనాలి సాంబశివారెడ్డి, జ్వల నర్సింహారావు, ఎండీ రెహమాన్, డి. శేఖర్ తదితరులు పాల్గొన్నారు.