ఖమ్మం జిల్లాలోని పెనుగోలు కాలనీ గ్రామస్థులు ఎదుర్కొంటున్న ఇంటి పన్నులు, ఇంటి పట్టాలు, కరెంట్ మీటర్ల సమస్యలపై ఆదివాసీ నవనిర్మాణ సేన నాయకులు మండల ప్రజావాణిలో వినతి పత్రం అందించారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సేన మండల అధ్యక్షుడు మోడెం నాగరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ఎంపీడీఓకు వినతి పత్రం అందజేశారు. ప్రజావాణిలో ప్రజల సమస్యలను పట్టించుకోని అధికారుల తీరుపై ఆయన మండిపడ్డారు.