ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్‌: కాపా సుధాకర్

1711చూసినవారు
ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ప్రజా దర్బార్‌ను నిర్వహించారు. వైరా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కాపా సుధాకర్ మాట్లాడుతూ, ప్రజలు తమ సమస్యలను ప్రతి గురువారం దరఖాస్తు రూపంలో ఇక్కడ అందజేయవచ్చని, కాంగ్రెస్ కమిటీ ద్వారా వాటిని వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ ప్రజా దర్బార్ ఖమ్మం సంజీవరెడ్డి భవన్‌లో జరిగింది.

సంబంధిత పోస్ట్