ఖమ్మం జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా మారింది. సోమవారం నగరంలోని కాల్వఒడ్డు భారత్ పెట్రోలియం బంక్ వద్ద వాహనదారులు అర కిలోమీటర్ మేర క్యూలో నిలబడ్డారు. బాటిళ్లు, క్యాన్లతో గంటల తరబడి వేచి చూస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొనడంతో ప్రయాణికులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. స్టాక్ లేక అనేక బంకులు మూతపడ్డాయి, తెరిచి ఉన్న చోట రద్దీని నియంత్రించడం కష్టంగా మారింది.