మానవ జీవితంలోని అనుభవాలు, సామాజిక పరిణామాలను ప్రతిబింబించేలా రాచమల్ల ఉపేందర్ కథలు ఉన్నాయని కాళోజీ అవార్డు గ్రహీత, ప్రముఖ సాహితీవేత్త సీతారాం అన్నారు. అక్షరాల తోవ సాహిత్య సంస్థ ఆధ్వర్యంలో ఖమ్మం జడ్పీ మీటింగ్ హాల్లో రాచమల్ల ఉపేందర్ రచించిన ఉడికిన మెతుకు, అక్షరానుభూతి పుస్తకాలను ఆవిష్కరించారు. రాచమల్ల చుట్టూ జరిగే సంఘటనలను నిశితంగా పరిశీలించి కథలుగా మలుస్తారని సీతారాం కొనియాడారు. కథ, కవిత, సమీక్ష, పాటల రచన, గానం వంటి పలు ప్రక్రియల్లో ఆయన ప్రతిభ చూపుతున్నారని అన్నారు. కార్యక్రమంలో పొత్తూరి సీతారామరావు, కన్నెగంటి వెంకటయ్య, కొండ్రు బ్రహ్మం, నామా పురుషోత్తం, సయ్యద్ షఫీ తదితరులు పాల్గొన్నారు.