రఘునాధపాలెం: బాల్య వివాహాల నివారణపై చర్యలు తీసుకోవాలి

7చూసినవారు
రఘునాధపాలెం: బాల్య వివాహాల నివారణపై చర్యలు తీసుకోవాలి
తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్ సీతా దయాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం రఘునాధపాలెం మండలంలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఆంగన్‌వాడీ టీచర్లు, ఇతర శాఖల అధికారులతో సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో బాలల హక్కుల పరిరక్షణ, బాల్య వివాహాల నివారణ, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, పిల్లల విద్య హక్కు వంటి కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. బాల్య వివాహాలను నివారించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్