పీఏసీఎస్ చైర్మన్ సుధాకర్ శుక్రవారం రఘునాథపాలెం మండలం మంచుకొండ సొసైటీ కార్యాలయంలో రైతులకు జిలుగు విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పంట అవశేషాలను కాల్చడం వల్ల పర్యావరణానికి నష్టం కలుగుతుందని, అవగాహన లేకుండా ఇలా చేయడం వల్ల అనేక నష్టాలు జరుగుతున్నాయని తెలిపారు. విచ్చలవిడిగా రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి, సేంద్రీయ విధానంలో సాగు చేయాలని రైతులకు సూచించారు. భూమిలో సేంద్రియ పదార్థం పెరగడం వల్ల రసాయన ఎరువుల ఖర్చుతో పాటు యూరియా వినియోగం కూడా తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు.