రఘునాథపాలెం: భూమి పత్రాలు ఇవ్వాలని వినతి

56చూసినవారు
రఘునాథపాలెం: భూమి పత్రాలు ఇవ్వాలని వినతి
రఘునాథపాలెంలో సంత్ సేవాలాల్ మహారాజ్ ప్రాంగణంలో గతంలో కేటాయించిన ప్రభుత్వ భూమిలో మందిర నిర్మాణానికి అవసరమైన పత్రాలు అందించాలని కోరుతూ గిరిజన (లంబాడీ) నాయకులు శనివారం తహసీల్దార్ విల్సన్ బెన్నీకి వినతిపత్రం అందించారు. సంబంధిత అనుమతులు త్వరితగతిన మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల లంబాడీ నాయకులు బాదావత్ నంద్యా, అంగోతు జగ్య, మాలోత్ రాము, భూక్యా రాంబాబు, బోడ ఉపేందర్, ధరావత్ రామమూర్తి ఉన్నారు.

సంబంధిత పోస్ట్