ఖమ్మం జిల్లా, చింతకాని మండలం మత్కేపల్లి క్రాస్ రోడ్ వద్ద మంగళవారం నిర్వహించనున్న సీఎం రైతు ఆశీర్వాద సభకు వర్షం ఆటంకంగా మారింది. ఆదివారం కురిసిన భారీ వర్షంతో సభా ప్రాంగణం బురదమయంగా మారింది. సోమవారం జిల్లా అధికారులు, స్థానిక నాయకులు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. షెడ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. మరోసారి భారీ వర్షం కురిస్తే సభ నిర్వహణపై ప్రభావం పడే అవకాశం ఉందని స్థానికంగా చర్చ సాగుతోంది.