ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు మరో 2 – 3 గంటలు వర్ష సూచన

3చూసినవారు
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు మరో 2 – 3 గంటలు వర్ష సూచన
భారత వాతావరణ శాఖ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నవంబర్ 4న మధ్యాహ్నం 1 గంట వరకు ఈ హెచ్చరిక అమల్లో ఉంటుందని వెల్లడించింది. రానున్న 2–3 గంటల్లో జిల్లాల్లో తేలికపాటి వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 40 కిలోమీటర్లలోపు వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉరుములు, మెరుపుల సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో ఉండరాదని సూచించారు. రైతులు, వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

సంబంధిత పోస్ట్