ఖమ్మం లో ఘనంగా రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు

14చూసినవారు
ఖమ్మం లో ఘనంగా రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు
ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం  ఘనంగా నివాళులర్పించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కిలారు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్ఆర్ పేదలు, రైతులు, మహిళలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి విశేష కృషి చేశారని, ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చారని నాయకులు గుర్తుచేశారు.

సంబంధిత పోస్ట్