ఖమ్మం మామిళ్లగూడెంలో కణతాల రాము(30), అతని పెద్ద కుమార్తె దివ్యశ్రీ(5) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన కేసులో కీలక సాక్షిగా భావించిన రాము భార్య రమ్య(28) కూడా చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందారు. ఆదివారం వీరి మృతదేహాల పక్కనే అపస్మారక స్థితిలో ఉన్న రమ్య, చిన్న కుమార్తె రితిక(3)ను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. రితిక చికిత్స పొందుతోంది. రాము అన్న ఉపేందర్‌రావు ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. రమ్య ఇచ్చిన సమాధానాలు పొంతనలేకుండా ఉన్నాయని, పోస్టుమార్టం రిపోర్టుతో స్పష్టత వస్తుందని పోలీసులు తెలిపారు.