ఖమ్మం జిల్లాలో వానాకాలం ధాన్యం కొనుగోళ్లు రికార్డు స్థాయిలో ముగిశాయి. 3.30 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యానికి గాను, 3.67 లక్షల టన్నులు సేకరించినట్లు డీఎస్ఓ చందనకుమార్ తెలిపారు. రైతులకు రూ. 877.98 కోట్లు చెల్లించారు. సన్నబియ్యం బోనస్ కింద 39,476 మందికి రూ. 113.57 కోట్లు జమ చేశామని, మిగిలిన వారికి త్వరలోనే చెల్లింపులు పూర్తి చేస్తామని వెల్లడించారు.