ఖమ్మం జిల్లా, 15వ డివిజన్లో
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రెడ్డి బోయిన కోటేశ్వరరావు శుక్రవారం ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ చేతుల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మెరిగల తిరుపతిరావు, ఎర్రం శెట్టి రవీందర్, పసుపులేటి శ్రీనివాసరావు, మెరిగల కృష్ణయ్య, ఓర్సు రవి, ఓర్సు నవీన్ తదితర
కాంగ్రెస్ నాయకులు కోటేశ్వరరావుకు శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్తులో పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.