1956లో ఏర్పడిన ఏన్కూర్ గ్రామపంచాయతీతో పాటు జన్నారం, ఆరికాయలపాడు, నాచారం గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు నిలిచిపోయాయి. 69 ఏళ్ల క్రితం మొదటి సర్పంచి ఎన్నికైన ఏన్కూరులో, 2025 డిసెంబర్‌లో జరగాల్సిన సాధారణ ఎన్నికలకు జనరల్ అభ్యర్థులు పోటీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కొందరు కోర్టును ఆశ్రయించడంతో, కోర్టు స్టే ఆర్డర్ కారణంగా ఎన్నికల కమిషన్ ఎన్నికలను నిలిపివేసింది. ఈ నాలుగు పంచాయతీల్లో కోర్టు స్టే ఆర్డర్ ఉన్నందున ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని అధికారులు తెలిపారు. దీంతో ఎన్నికల వాతావరణం కనిపించకపోవడంతో స్థానికులు ఆశ్చర్యంగా చర్చించుకుంటున్నారు.