అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మంగళవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలో గృహనిర్మాణ సంస్థ చైర్మన్ పీవీ గౌతమ్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గంలో మొదటి విడతలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై చర్చించారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు ఫైనల్ బిల్లులను త్వరగా విడుదల చేయాలని, పెండింగ్ బిల్లులను చెల్లించి వారి సమస్యలను పరిష్కరించాలని చైర్మన్‌కు విన్నవించారు.