జిల్లా నుంచి రైతుభరోసా నిధుల విడుదల కోసం బహిరంగ సభ నిర్వహించాలనే ప్రణాళిక వాతావరణ పరిస్థితుల కారణంగా సాధ్యపడలేదు. దీంతో, చింతకాని మండలం మత్కేపల్లిలో ఎంపిక చేసిన స్థలంలోనే మరో సభ నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం భట్టి వెల్లడించారు. రైతుభరోసా నిధుల పంపిణీ పూర్తయ్యాక, జులై 6, 7 లేదా 8వ తేదీల్లో ఒకరోజు మత్కేపల్లిలోనే ముగింపు సభ నిర్వహించాలని మంగళవారం నిర్ణయించారు.