ఖమ్మం నగరంలో మైనర్ బాలికపై జరిగిన అమానుష దాడి, హత్యాయత్నం ఘటనలో నిందితుడు మహమ్మద్ గౌస్ పాషాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర డీజీపీని కలిసి వినతిపత్రం అందజేసిన ఆయన, పోక్సో చట్టం కింద నిందితుడికి అత్యంత కఠిన శిక్ష విధించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే, బాధిత బాలిక కుటుంబానికి తగిన నష్టపరిహారం అందించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.