
BCB ప్రెసిడెంట్‌గా మాజీ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్
బంగ్లాదేశ్ నేషనల్ స్పోర్ట్స్ కౌన్సిల్ (NSC) మంగళవారం అమీనుల్ ఇస్లాం బుల్బుల్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB)ను రద్దు చేసింది. గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన బోర్డు ఎన్నికల్లో అక్రమాలు, అధికార దుర్వినియోగం జరిగినట్లు ప్రభుత్వ విచారణ కమిటీ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాబోయే 90 రోజుల్లో కొత్త ఎన్నికలు నిర్వహించడానికి 11 మంది సభ్యులతో కూడిన అడ్హక్ కమిటీని ప్రభుత్వం ప్రకటించింది. దిగ్గజ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్‌ను ఈ కమిటీకి అధ్యక్షుడిగా నియమించారు. దీంతో 37 ఏళ్ల తమీమ్, బోర్డు చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన అధ్యక్షుడిగా రికార్డు సృష్టించారు.




