రఘునాథపాలెం మండలం పంగిడి గ్రామానికి చెందిన షేక్ రియాజ్ పాషా 20 సార్లు రక్తదానం చేసి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారికి అండగా నిలిచి పలువురి ప్రాణాలను కాపాడారు. అంతర్జాతీయ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఆయన సేవలను స్థానికులు అభినందించారు.