సత్తుపల్లి డిపోను సందర్శించిన ఆర్ఎం

4చూసినవారు
సత్తుపల్లి డిపోను సందర్శించిన ఆర్ఎం
ఖమ్మం ఆర్టీసీ రీజినల్ మేనేజర్ ఏ. సరిరాం మంగళవారం సత్తుపల్లి డిపోను సందర్శించి, ఉద్యోగులతో సమావేశమై డిపో అభివృద్ధికి పలు సూచనలు చేశారు. నేషనల్ సేఫ్టీ వీక్ సందర్భంగా మెకానిక్ లకు భద్రతా అంశాలపై అవగాహన కల్పించారు. ప్రయాణికుల భద్రత, డ్రైవర్ల అప్రమత్తతపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించకపోవడం వంటి వాటి వల్ల జరిగే ప్రమాదాలపై అవగాహన కల్పించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్