శుక్రవారం ఖమ్మం నగరంలో హైదరాబాద్ కు చెందిన తొమ్మిది మంది భక్తులు భద్రాచలంలో శ్రీరాముని కల్యాణ మహోత్సవానికి వెళ్తుండగా ఘోర ప్రమాదానికి గురయ్యారు. ఖమ్మం బైపాస్ లో ముందు వెళ్తున్న డీసీఎం డ్రైవర్ సిగ్నల్ ఇవ్వకుండా యూటర్న్ తీసుకోవడంతో, వారి టెంపో దానిని ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ తో పాటు ఇద్దరు బాలికలు, ఆరుగురు మహిళలు, ఒక పురుషుడు గాయపడ్డారు. క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తొలుపునూరి శ్రీనివాస్ గౌడ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ బాలకృష్ణ తెలిపారు. డీసీఎం డ్రైవర్ పరారీలో ఉన్నాడు.