రోడ్డు ప్రమాదం

6చూసినవారు
రోడ్డు ప్రమాదం
ఆదివారం పేరుపల్లిలో ఆటో బోల్తా కొట్టడంతో ఆరుగురు చిన్నారులు గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం, ఆటో డ్రైవర్ వజ్జా సునీల్ ఆ గ్రామానికి చెందిన ఆరుగురు పిల్లలను ఊరి చివర తీసుకెళ్లారు. పిల్లల్లో ఒకరు ఆటో నడపబోయి అదుపుతప్పి రోడ్డు పక్కకు బోల్తా కొట్టించారు. ఈ ప్రమాదంలో పులసం యశ్వంత్, అలెం స్నేహితు తీవ్రంగా గాయపడగా, భరత్, తేజ, చిట్టు, ప్రవీణ్ లకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వారిని కారేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, ప్రథమ చికిత్స అనంతరం ఖమ్మం తరలించారు.

సంబంధిత పోస్ట్