ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారంలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి, ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.