బుచ్చిరెడ్డి పాలెం రోడ్డులో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

9చూసినవారు
బుచ్చిరెడ్డి పాలెం రోడ్డులో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
ఖమ్మం జిల్లా, మధిర సమీపంలోని బుచ్చిరెడ్డి పాలెం బనిగళ్ళపాడు రోడ్డు మార్గంలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కృష్ణా జిల్లా మైలవరం మండలం పుల్లూరుకు చెందిన సకుర్తి రాంబాబు అనే వ్యక్తి మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో వ్యక్తికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రెండు బైకుల మధ్య జరిగిన ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్