గత నెల 8న మణుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ కండక్టర్ ప్రవళికపై ఒక ప్రయాణికురాలు దాడి చేసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ప్రవళిక, పది రోజులుగా హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందారు. దీనికి నిరసనగా ఖమ్మం రీజియన్ జేఏసీ పిలుపు మేరకు సత్తుపల్లి డిపో కార్మికులు విధుల బహిష్కరణ చేసి బంద్ నిర్వహించారు. ప్రజాసేవలో ఉన్న ఉద్యోగులపై దాడులు జరగడం పట్ల కార్మికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం నాటి ఈ పరిణామం రవాణా రంగంలో చర్చనీయాంశమైంది.