ఖమ్మం నగరంలోని వైరా రోడ్డులో జిల్లా కోర్టు సమీపంలో లకారం చెరువుకు వెళ్లే కాల్వ వద్ద అకస్మాత్తుగా రోడ్డు కుంగిపోయి బోరు ఏర్పడింది. దీనివల్ల కొంత మేరకు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ట్రాఫిక్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి, ట్రాఫిక్‌ను నియంత్రించి, కుంగిన రోడ్డుకు మరమ్మతులు చేపట్టారు. ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.