
ప్రజలకు అలర్ట్.. మళ్ళీ పెద్దపులి వచ్చేసింది !
పోలవరం జిల్లా నుంచి తూర్పుగోదావరి జిల్లాలోకి పెద్దపులి ప్రవేశించిందని ఇందుకూరు అటవీ శాఖ రేంజ్ అధికారి కొండలరావు గురువారం తెలిపారు. ఐదు రోజులుగా దేవీపట్నంలో సంచరించిన పెద్దపులి ప్రస్తుతం సీతానగరం మండలం అచ్చయ్య పాలెం, చీపురుపల్లి గ్రామాల సమీపంలో ఉందని తెలిపారు. ట్రాకింగ్ సిస్టం ద్వారా పులి ఆ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించామని చెప్పారు.




