సత్తుపల్లి మండలం కిష్టారం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. మృతులలో కొమ్మేపల్లి కాలనీకి చెందిన 18 ఏళ్ల ఇంటర్ విద్యార్థి సిద్ధేశీ జాయ్, 12 ఏళ్ల 6వ తరగతి విద్యార్థి మర్సకట్ల శశి, చండ్రుగొండకు చెందిన షాధిక్ ఉన్నారు. ఈ ప్రమాదంలో అన్నపురెడ్డిపల్లికి చెందిన తలారి అజయ్, చండ్రుగొండకు చెందిన ఇమ్రాన్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.