ఖమ్మం ప్రెస్ క్లబ్ వ్యవహారాల ఇంచార్జీగా సీనియర్ జర్నలిస్ట్ కె. కళ్యాణ్ చక్రవర్తిని ఎంపిక చేశారు. ఆదివారం ఖమ్మం జిల్లాలో డబ్ల్యూజేఐ జిల్లా కన్వీనర్ గంటెల ఆనంద్ అధ్యక్షతన జరిగిన ప్రత్యేక సమావేశంలో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి నారా సుబ్రమణ్యేశ్వర రావు (ఎన్. ఎస్ రావు) ఈ నియామకాన్ని ప్రకటించారు. రెండు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న కళ్యాణ్, ప్రెస్ క్లబ్ వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. ఈ నియామకం పట్ల జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.