ఐయూఎంఎల్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా షేక్ బాజీ బాబా

69చూసినవారు
ఐయూఎంఎల్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా షేక్ బాజీ బాబా
ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా షేక్ బాజీ బాబా నియమితులయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ షకీల్ హైదరాబాద్‌లోని రాష్ట్ర కార్యాలయంలో షేక్ బాజీ బాబాకు నియామక పత్రాన్ని గురువారం అందజేశారు. షేక్ బాజీ బాబా మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల పక్షాన నిరంతరం పోరాడుతానని హామీ ఇచ్చారు. తనను నియమించిన రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ షకీల్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్