టీజీఎన్‌పీడీసీఎల్ వైరా డివిజన్‌లో ఏఈల కొరత, పనులకు ఆటంకం

6చూసినవారు
టీజీఎన్‌పీడీసీఎల్ వైరా డివిజన్‌లో ఏఈల కొరత, పనులకు ఆటంకం
టీజీఎన్‌పీడీసీఎల్ వైరా డివిజన్ పరిధిలో అసిస్టెంట్ ఇంజినీర్ల (ఏఈ) కొరత తీవ్రంగా నెలకొంది. వైరా, కొణిజర్ల, ఏన్కూరు, సింగరేణి మండలాల్లోని పలు సెక్షన్లలో అధికారులు లేకపోవడంతో పనులు నిలిచిపోయాయి. వైరా టౌన్ ఏఈ సుందర్‌కుమార్ పదోన్నతిపై వెళ్లగా, రూరల్ ఏఈ వెంకటసాయికుమార్ సెలవుపై వెళ్లడంతో రెండు కీలక సెక్షన్లకు రెగ్యులర్ ఏఈలు అందుబాటులో లేరు. అంతేకాకుండా, లైన్‌మన్ పోస్టు కూడా గత ఆరు నెలలుగా ఖాళీగా ఉండటంతో సమస్యలు మరింత తీవ్రమయ్యాయి.

సంబంధిత పోస్ట్