
ఇప్పటికీ రాజధాని కోసం కొట్టుకుంటున్నాం: పవన్ కళ్యాణ్
రాష్ట్రం ఏర్పడి ఇన్నేళ్లైనా రాజధాని కోసం పోరాడుతున్నామని, రాష్ట్రాన్ని విభజించినప్పుడు కాంగ్రెస్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. తెలంగాణ, ఆంధ్ర వేర్వేరు కాదని, తెలుగు నేల అనే భావన ఉందని ఆయన తెలిపారు. రాష్ట్రం ఏర్పడే నాటికి సరైన కార్యాలయాలు లేకపోయినా, చంద్రబాబు నాయుడు ఆశావాదంతో పనిచేశారని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడి ఇన్నేళ్లైనా ఇప్పటికీ రాజధాని కోసం పోరాడుతున్నామని ఆయన అన్నారు.




