సురక్షిత మాతృత్వంతోనే సమాజ అభివృద్ధి: కలెక్టర్ అనుదీప్

6చూసినవారు
సురక్షిత మాతృత్వంతోనే సమాజ అభివృద్ధి: కలెక్టర్ అనుదీప్
సురక్షిత మాతృత్వంతోనే సమాజ అభివృద్ధి సాధ్యమని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో సురక్షిత మాతృత్వ దినోత్సవంలో ఆయన మాట్లాడుతూ, గర్భిణులకు సకాలంలో వైద్య పరీక్షలు అందించి, హైరిస్క్ కేసులపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. ఈ ఏడాది చివరినాటికి జిల్లాలో మాతృ, శిశు మరణాలను సున్నా స్థాయికి తగ్గించడమే లక్ష్యంగా వైద్యారోగ్య శాఖ సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.

సంబంధిత పోస్ట్