పాల్వంచ పట్టణంలోని 39వ డివిజన్‌లో శ్రీరామ నవమి సందర్భంగా ఏర్పాటుచేసిన ఫ్లెక్సీ వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. బీఆర్‌ఎస్ కార్పొరేటర్ గోవాడ గుణచరిత్, సీనియర్ నాయకుడు బేతంశెట్టి విజయ్ మధ్య ఫ్లెక్సీ ఏర్పాటు విషయంలో మొదలైన విభేదాలు తీవ్రమయ్యాయి. ఈ క్రమంలో గుణచరిత్ ఇనుప రాడ్‌తో విజయ్ తలపై దాడి చేయడంతో ఆయనకు గాయాలయ్యాయని సమాచారం. దీనికి ప్రతిస్పందనగా విజయ్ కుటుంబ సభ్యులు, అనుచరులు గుణచరిత్ తండ్రి గోవాడ రవిపై దాడి చేశారని సమాచారం. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చి, విజయ్ ఫిర్యాదు మేరకు కార్పొరేటర్ గుణచరిత్‌పై కేసు నమోదు చేశారు.