ఖమ్మం జిల్లా, పెనుబల్లి మండలం గణేషన్ పాడు (సొబ్బాయిగూడెం)లో శ్రీ వీరబ్రహేంద్రస్వామి వారి దేవాలయ ప్రతిష్ఠా మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య హాజరయ్యారు. ఆలయ కమిటీ ఆయనను శాలువాతో సత్కరించింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.