ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో ఎమ్మెల్సీ ఓటు నమోదు పేరుతో మీసేవ కేంద్రాల్లో ఒక్కో అభ్యర్థి నుంచి రూ. 100 వసూలు చేయడం సరికాదని సీపీఐ మండల కార్యదర్శి యంగల ఆనందరావు అన్నారు. నిరుద్యోగ గ్రాడ్యుయేట్లపై ఈ రుసుము అదనపు భారం అవుతుందని, ఓటు హక్కు ప్రజాస్వామ్య హక్కు కాబట్టి ప్రభుత్వం ఉచితంగా ఓటు నమోదు చేపట్టాలని మంగళవారం ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు తహసిల్దార్ చెల్లూరి సుధాకర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆకెన పవన్, గుంపుల జయరాజు తదితరులు పాల్గొన్నారు.