త్రివేణి విద్యాసంస్థల విద్యార్థులు ఎస్‌ఎస్‌సిలో సత్తా చాటారు

1144చూసినవారు
త్రివేణి విద్యాసంస్థల విద్యార్థులు ఎస్‌ఎస్‌సిలో సత్తా చాటారు
ఖమ్మం జిల్లాలోని త్రివేణి విద్యాసంస్థలు తెలంగాణ ఎస్‌ఎస్‌సి ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచాయి. 600 మార్కులకు గాను 595 మార్కులతో విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి రికార్డు సృష్టించారు. 580 పైగా మార్కులతో 33 మంది, 570 పైగా 81 మంది, 550 పైగా 268 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. డైరెక్టర్ డా. గొల్లపూడి వీరేంద్ర చౌదరి మాట్లాడుతూ, అనుభవజ్ఞులైన బోధనా సిబ్బంది, ప్రత్యేక విద్యా ప్రణాళికలే ఈ విజయాలకు కారణమని, త్రివేణి తెలంగాణలోనే నెం.1గా నిలిచిందని తెలిపారు. సంస్థ విద్యార్థులు, తల్లిదండ్రులు, సిబ్బందికి అభినందనలు తెలిపింది.
Job Suitcase

Jobs near you